NTV Telugu Site icon

Modi-Manu Bhakar: మను భాకర్ కు ప్రధాని ఫోన్.. ఏమన్నారంటే..?

Modi Manu Bhakar

Modi Manu Bhakar

ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది. ఫైనల్లో మను మొత్తం 221.7 పాయింట్లు సాధించింది. ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. షూటర్ మను భాకర్‌కు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోడీ ఆమెకు ఫోన్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మనుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమెకు అభినందనలు తెలిపారు. టోక్సో ఒలింపిక్స్ గురించి ప్రస్తావన వచ్చింది.

READ MORE: Prashant Kishor: రాజకీయ పార్టీ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ .. ‘జన్ సురాజ్ పార్టీ’గా పేరు..

“మను మీకు శుభాకాంక్షలు. మీరు విజయం సాధించారన్న వార్త విన్న తర్వాత ఉత్సాహం, ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. రజతం చేజారినప్పటికీ.. మీరు మన దేశం పేరును నిలబెట్టారు. మీకు రెండు విధాలా క్రెడిట్‌ దక్కుతుంది. ఒకటి కాంస్యం సాధించడం అయితే.. రెండు.. ఈ విభాగంలో పతకం తీసుకొచ్చిన తొలి మహిళగా రికార్డు సృష్టించడం. టోక్యో ఒలింపిక్స్‌ సమయంలో మీకు పిస్టల్‌ లో లోపం సంభవించింది. అప్పటి లోపాన్ని ఇప్పుడు కవర్ చేశారు. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. ప్రారంభమే చాలా బాగుంది. మీరు తప్పకుండా పతకం సాధిస్తారనుకున్నాను.” అని మోడీ మాట్లాడారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారా అని మనుని అడిగారు మోడీ. తన నాన్న రామ్‌కిషన్‌ చాలా సంతోషిస్తుంటారని..తనని చాలా ప్రోత్సహించారన్నారు. తోటి క్రీడాకారులు అందరూ సౌకర్యంగానే ఉన్నారా? అక్కడ అన్ని ఏర్పాట్లు సరిగ్గానే ఉన్నాయా? అని అడిగారు. మన క్రీడాకారులకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.

READ MORE:Gujarat: పెళ్లైన ఏడాదికి బయటపడ్డ భార్య సీక్రెట్.. డాక్టర్ వద్దకు వెళ్లడంతో తెలిసిన నిజం..

ఈ సందర్భంగా మను మాట్లాడుతూ.. మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ” మన క్రీడాకారులు ఇక్కడ రాణిస్తున్నారు. నాకు భవిష్యత్తులో ఇంకా మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో రాణిస్తా. క్రీడాకారులందరూ ఇక్కడ ఆనందంగా ఉన్నారు. మిమ్మల్ని కూడా గుర్తు చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఫలించాయి.” అని సమాధానమిచ్చింది.

Show comments