NTV Telugu Site icon

Yogi Adityanath: తాజ్‌మహాల్ కట్టిన కూలీల చేతులు నరికేశారు.. రామమందిరం కట్టిన వారికి గౌరవం

Yogi Adityanath

Yogi Adityanath

రామ మందిర నిర్మాణంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించారని.. కానీ తాజ్ మహల్ కోసం పనిచేసిన కార్మికుల చేతులు నరికేశారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తికి ఉన్న గౌరవాన్ని అభినందిస్తూ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూహెచ్‌ఈఎఫ్) వార్షిక సదస్సులో యూపీ ముఖ్యమంత్రి ప్రసంగించారు.

READ MORE: TTD Update: టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం!

“జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరాన్ని నిర్మించిన కార్మికులను సన్మానించడం మీరు చూశారు. ప్రధానమంత్రి వారిపై పూల వర్షం కురిపించారు. మరోవైపు తాజ్‌మహల్‌ను నిర్మించిన కార్మికుల చేతులు నరికే పరిస్థితిని కూడా గమనించాలి. వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మంది కార్మికుల చేతులు కూడా తెగిపోయాయి. దీని వల్ల ఒక సంప్రదాయం, వారసత్వం ధ్వంసమైపోయింది. గతంలో లాగా కాకుండా ప్రస్తుతం భారతదేశం శ్రామిక శక్తిని గౌరవిస్తోంది. శ్రామికులకు అన్ని రకాల భద్రతలను కల్పిస్తోంది.” అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.

READ MORE:Amit Shah: అదానీ లంచం ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన అమిత్ షా..

‘ఐడెంటిటీ క్రైసిస్‌’ నుంచి భారత్‌ను ప్రధాని మోడీ బయటకు తీసుకొచ్చారని సీఎం కొనియాడారు. సంభాల్‌లో గుడి- మాసీద్ వివాదంపై సీఎం స్పందించారు. నేడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, పెంచుతున్న వారు తమ వారసత్వం అని చెప్పుకుంటారన్నారు. సనాతన ధర్మం భారత్‌లో ఆచరిస్తున్నప్పుడు ఇంకా ఆ మతం(ఇస్లాం) పుట్టలేదన్నారు. ఇదిలా ఉండగా… ‘విశ్వ హిందూ ఎకనామిక్ ఫోరమ్’ డిసెంబర్ 13న ముంబైలోని బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైంది. డిసెంబర్ 15 వరకు కొనసాగుతుంది.

Show comments