Site icon NTV Telugu

PM Modi: భారత హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు..

Pm Modi

Pm Modi

పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు. భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా.. స్పెయిన్ పై విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Read Also: CM Chandrababu: వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. రైతులకు గుడ్ న్యూస్..

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో మెరిసి కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన ఘనత రానున్న తరాలకు గుర్తుండేలా ఉందని తెలిపారు. ఒలింపిక్స్‌లో టీమిండియాకు ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం అని అన్నారు. ఈ విజయం వారి నైపుణ్యం, పట్టుదల.. టీమ్ స్పిరిట్ యొక్క విజయమని తెలిపారు. జట్టు అపారమైన సహనం.. స్థితిస్థాపకతను కనబరిచిందని.. భారతీయులందరికీ హాకీ పట్ల భావోద్వేగ అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ విజయం మన దేశ యువతలో గేమ్‌ను మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: Pranavi Chandra: కరీబియన్ ఉమెన్ ప్రీమియర్ లీగ్కు హైదరాబాద్ క్రికెటర్ ఎంపిక..

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు 13వ పతకాలను సాధించింది. అందులో 8 బంగారు పతకాలు ఉన్నాయి. మరోవైపు.. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టుకు పిఆర్ శ్రీజేష్ వీడ్కోలు పలికాడు. అతను ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. భారత జట్టు తమ మాజీ కెప్టెన్‌కు సముచిత వీడ్కోలు పలికింది. కాగా.. ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య 4కి చేరింది.

Exit mobile version