NTV Telugu Site icon

America Telangana Student : తెలంగాణ కుర్రాడికి ప్రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్‌

Ts Boy

Ts Boy

America Telangana Student : భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడిన వారు ఆయా రంగాల్లో అభివృద్ధి చెంది ఎంతో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. అటువంటి వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన సుందర్‌ పిచాయ్‌ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. సత్య నాదెండ్ల కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం ఇండియా గర్వించదగ్గ విషయం. ఇలా చాలా మంది అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియా, జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లో ఎంతో మంది స్థిరపడిన భారతీయులు ఉంటున్నారు.. వారిలో తెలుగు వారు కూడా ఉంటున్నారు.

Also Read : NCRB: దేశంలో పెరుగుతున్న ప్రేమ హత్యలు.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీఆర్‌బీ

అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు కూడా ఇపుడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్‌-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో హైస్కూల్‌ సీనియర్స్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న తేజ కోడూరు 2023 ఏడాదికి గాను ‘ప్రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్‌’కు ఎంపికైనట్టు అమెరికా విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తేజ ప్రతిభా పాటవాలు అమోఘంమని.. అకడమిక్‌ విజయాలు, కళాకారుడిగా ఉత్తమ ప్రదర్శనతోపాటు సాంకేతిక అంశాలపై పట్టు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డుకు అతడిని ఎంపిక చేశామని విద్యాశాఖ ప్రకటించింది.

Also Read : Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ముస్తాబైన గ్రేటర్‌