NTV Telugu Site icon

Putin: మోడీజీ రష్యాకు రండి.. ప్రధానికి పుతిన్ ఆహ్వానం..

Putin

Putin

Russia President: క్రెమ్లిన్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా అధినేతతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపించారు. రష్యాలో మా మిత్రుడు, ప్రైమ్ మిస్టర్ ప్రధాని మోడీని చూసి మేము సంతోషిస్తామని పుతిన్ జైశంకర్ తో చెప్పారు. ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం రష్యాకు వచ్చిన జైశంకర్ అంతకు ముందు రష్యా కౌంటర్ సెర్గీ లావ్ రోవ్ తో భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా రష్యా- భారతదేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ పెరుగుతోంది.. ముఖ్యంగా ముడి చమురు, అధిక సాంకేతిక రంగాల కారణంగా పెరుగుతుంది అని అన్నారు.

Read Also: Ranbir Kapoor : రణబీర్ కపూర్‌పై మండిపడుతున్న హిందువులు.. పోలీసు కేసు నమోదు..

వచ్చే ఏడాది జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్లు కలుస్తారనే నమ్మకం తనకు ఉంది అని జైశంకర్ అన్నారు. ఇంతకు ముందు తన ప్రారంభ ఉపన్యాసంలో ఇద్దరు నాయకులు తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడు మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశం ఇరు పక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యున్నత సంస్థాగత సంభాషణగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరించారు.

Read Also: Catherine Tresa : కైపెక్కిస్తున్న చూపులతో స్టన్నింగ్ లుక్ లో కేథరిన్ హాట్ ట్రీట్..

ఇక, అనేక అంశాలపై వాళ్లు భారత్- రష్యా మధ్య చర్చ జరిగింది అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించుకున్నట్లు పేర్కొన్నారు. ఇక, శాంతియుతంగా రష్యా సమస్యను పరిష్కరించుకునేందుకు పూర్తిగా సహకరిస్తున్న భారతదేశానికి సమాచారాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.