Site icon NTV Telugu

Bandi Srinivas: రాజకీయ పదవులు వస్తే కాదనను, నేను రాజకీయాలకు రెడీ

Bandi Srinivas

Bandi Srinivas

రాజకీయ పదవులు వస్తే కాదనను, తాను రాజకీయాలకు రెడీ అంటున్నారు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్.. పదవి వస్తే ఎందుకు కాదంటాను అంటున్నారాయన.. రేపు జరగబోయే ఏపీఎన్జీఓ మహాసభల గురించి మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి ఉండగా.. మరో ఆరు నెలల్లో బండి శ్రీనివాస్ అధ్యక్ష పదవి ముగుస్తోంది. దీంతో బండి శ్రీనివాస్ తదుపరి స్టెప్పేంటి అన్న దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు‌.. 2024 ఫిబ్రవరి వరకూ ఉద్యోగుల కోసమే పని చేస్తానని, ఆ తరువాత రాజకీయాలకు తాను సిద్ధమేనని బండి శ్రీనివాస్ తెలిపారు.

Read Also: RTC Bus Accident: పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

మరోవైపు రేపు, ఎల్లుండి విజయవాడలో ఏపీఎన్జీఓ రాష్ట్రస్ధాయి సమావేశాలు జరుగనున్నట్లు బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో వేలాదిగా ఉద్యోగులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. మహిళలకు 33% పదవులు ఏపీ ఎన్జీఓలో ఇస్తామని తెలిపారు. గెజిటెడ్ అధికారులను కూడా ఏపీఎన్జీఓ సంఘంలో చేర్చుకుంటామన్నారు. 11 పీఆర్సీలు తెచ్చిన పేటెంట్ మాదేనని ఆయన తెలిపారు. అన్ని సంఘాలు తమ నుంచి వెళ్ళిన కొమ్మలేనని.. ఏపీఎన్జీఓ ఒక మహా వృక్షం అని బండి శ్రీనివాస్ అన్నారు.

Exit mobile version