Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi Murmu: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం ప్రకటించారు. ఈ తాజా నిర్ణయంతో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (CJI) కాకుండా న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి 37కి పెరగనుంది. అంటే చీఫ్ జస్టిస్‌తో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి చేరుకుంటుంది. ఈ మేరకు “సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్, 2026″ను రాష్ట్రపతి జారీ చేశారని, ఇది 1956 నాటి మూల చట్టాన్ని సవరిస్తుందని మంత్రి మేఘ్వాల్ తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు మే 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఈ సంఖ్యను 4 పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో గుట్టలుగా పేరుకుపోతున్న కేసులు, పెరుగుతున్న వ్యాజ్యాలను వేగంగా పరిష్కరించడానికి ఇదొక సకాలంలో తీసుకున్న చర్యగా న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు దీనిని విస్తృతంగా స్వాగతిస్తున్నారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. కోర్టులో కొత్త కేసులు దాఖలవుతున్న రేటు నిరంతరం పెరుగుతున్నందున, జడ్జీల సంఖ్యను పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత న్యాయమూర్తుల కేసుల పరిష్కార రేటు అభినందనీయంగా ఉన్నప్పటికీ, విపరీతమైన కేసుల భారం వల్ల మరింత మంది న్యాయమూర్తులు అవసరమని అభిప్రాయపడ్డారు. దీనికి తగ్గట్టుగానే మౌలిక సదుపాయాలు సైతం పెరగాలని, ఈ ఏడాది చివరి నాటికి సుప్రీంకోర్టు నూతన భవనంలో కొంత భాగం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కొత్త భవనం వస్తే 38 మంది జడ్జీలకు సౌకర్యవంతంగా వసతి కల్పించవచ్చని, రాబోయే రోజుల్లో మొత్తం భవనం పూర్తయితే దాదాపు 50 మంది న్యాయమూర్తులు అవసరమవుతారని పేర్కొన్నారు.
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!