Preity Zinta: నా కెరీర్‌లో కఠినమైన సినిమా ఇదే: ప్రీతీ జింటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta on Lahore 1947 Movie: ఆరేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనున్నారు. ‘లాహోర్: 1947’తో ప్రీతీ తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. సన్నీడియోల్ హీరోగా, రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా సొట్టబుగ్గల సుందరి ఓ వీడియోను పంచుకున్నారు.
‘లాహోర్ 1947లో విజయవంతంగా నా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైంది. 1947లో లాహోర్‌లో జరిగిన సంఘటనల్ని చిత్ర యూనిట్ అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. నా జీవితంలో ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా.. కఠినమైన చిత్రం ఇది. నాకు సహకరించిన నటీనటులు, చిత్రబృందానికి ధన్యవాదాలు. అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా పేర్కొన్నారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
Also Read: Actor Karunas: బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. పోలీసులకు పట్టుబడిన నటుడు!
1998లో మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసిన ప్రీతీ జింటా.. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతీ.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహా యజమానిగా ఉన్నారు. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్నారు. ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మది కూడా ప్రీతీ దోచారు. 49 ఏళ్ల ప్రీతీ 2016లో జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్నారు. జీన్, ప్రీతీలకు సరోగసి విధానంలో కవల పిల్లలు జన్మించారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!