Actor Karunas: బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. పోలీసులకు పట్టుబడిన నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Karunas found 40 live bullets in Airport: తమిళ్ ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఆదివారం చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లిన కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. కరుణాస్‌ను సోదాలు చేస్తుండగా ఒక్కసారిగా సైరన్ మోగడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బ్యాగ్‌లో ఉన్న 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త తమిళ నాట పెను సంచలనంగా మారింది.
తిరుచ్చి వెళ్లాల్సిన కరుణాస్ ప్రయాణాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేసి విచారణ జరిపారు. బ్యాగులో అన్ని బుల్లెట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన వద్ద లైసెన్స్ గన్ ఉందని చెప్పిన కరుణాస్.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున తుపాకీని దిండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చానని, అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి రావడంతో బ్యాగులో ఉన్న బుల్లెట్ల బాక్సును గమనించలేదని కరుణాస్ తెలిపారు.
Also Read
దిండిక్కల్ పోలీస్ స్టేషన్‌లో తుపాకీ అప్పగించినట్లు రుజువు చేసే పత్రాలను కూడా ఎయిర్‌పోర్టు అధికారులకు కరుణాస్ చూపించారు. భద్రతా అధికారులు దిండిక్కల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా.. కరుణాస్ చెప్పింది నిజమేనని తేల్చారు. ఈ మాటలను రికార్డ్ చేసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు.. కరుణాస్‌ను తిరుచ్చి వెళ్లేందుకు అనుమతించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!