Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆడిన ఓ అద్భుతమైన షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లుంగి ఎంగిడి వేసిన స్లో బాల్‌కు ఒంటిచేతితో కొట్టిన సిక్సర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు అయ్యర్. ఆ షాట్ చూసి పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా (Preity Zinta) ఆనందంతో లేచి చప్పట్లు కొట్టడం ఇప్పుడు వైరల్ అవుతుంది.
పంజాబ్ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్ వేసిన లుంగి ఎంగిడి (Lungi Ngidi) తన ట్రేడ్‌మార్క్ స్లో డెలివరీతో అయ్యర్ ను పూర్తిగా ఆశ్చర్య పరిచాడు. ముందుగానే షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అయ్యర్ చేతి బ్యాట్ హ్యాండిల్ నుంచి జారిపోయింది. అయినప్పటికీ బంతి బ్యాట్ మధ్యభాగాన్ని తాకి మిడ్ ఆఫ్ మీదుగా నేరుగా సిక్సర్‌గా వెళ్లింది. ఈ షాట్ చూసి ఎంగిడి నిరాశగా నిలబడిపోగా, స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్టాండ్స్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రీతి జింటా వెంటనే లేచి చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ అయ్యర్ షాట్‌ను అభినందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
- Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
- Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్, పంజాబ్ ఇన్నింగ్స్‌కు దూకుడిని పెంచాడు. ప్రారంభంలో సీమ్ మూవ్‌మెంట్‌తో ఇబ్బంది పెట్టినప్పటికీ, ఆ తర్వాత ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేసిన అయ్యర్, ఎంగిడి బౌలింగ్‌లో కొట్టిన 73 మీటర్ల స్ట్రెయిట్ సిక్సర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధ్యమైన విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలో ఛేదించి ప్లే ఆఫ్ రేస్ ను మరింత ఉత్కంఠగా మార్చింది.
😍 Just look at Preity Zinta’s reaction after Shreyas Iyer smashed that one-handed SIX! 🤯🔥#PBKSvsDC #PreityZintapic.twitter.com/Axn5jCTEa8
— Faruk (@uf2151593) May 11, 2026
తాజావార్తలు
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!