NTV Telugu Site icon

Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి

Pragnent Women

Pragnent Women

బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ మహిళ 8 నెలల గర్భిణి.. అయితే ఆమెకు ఈ నెల 27న ప్రసవం కావాల్సి ఉంది. ఆమె మృతికి పోలీసులే బాధ్యత వహించాలని మృతురాలి బంధవులు ఆరోపించారు.

Read Also: Rahul Gandhi Vs Dhankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్‌కర్

నిజానికి భాగల్‌పూర్‌లోని స్పెషల్ సెంట్రల్ జైలులో జూన్ 6వ తేదీన దారుణ ఘటన జరిగింది. భాగల్‌పూర్‌కు చెందిన ఘోఘా గోవింద్‌పూర్‌కు చెందిన గుడ్డు యాదవ్‌కు ఘోఘా జనిదిహ్‌కు చెందిన పల్లవి యాదవ్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరిది ప్రేమ వివాహం కాగా ప్రస్తుతం పల్లవి 8 నెలల గర్భిణి. గుడ్డు యాదవ్‌కు వినోద్‌ యాదవ్‌తో భూమి విషయంలో గొడవ జరిగింది. ఈ కేసులో గుడ్డుపై సెక్షన్ 307 కేసు నమోదైంది.. దీని కారణంగా అతను గత ఎనిమిది నెలలుగా భాగల్పూర్ ప్రత్యేక సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

Read Also: Prabhas: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగిన ‘మైత్రీ’…

జూన్ 6న పల్లవి తన భర్త గుడ్డును కలిసేందుకు జైలుకు వెళ్లింది. గుడ్డు నెంబర్ రాగానే అతని ఎదురుగా పల్లవి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హడావుడిగా మాయాగంజ్‌ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఇక్కడ విచారణ జరిపిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పల్లవి మరణంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.

Read Also: Fake Cakes: తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్‌

బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి ఎనిమిదో నెలలో గర్భం దాల్చింది. జూన్ 27న డెలివరీ తేదీని కూడా వైద్యులు తెలిపారు. అయితే అంతకుముందే ఈ ఘటన జరిగింది. పోలీసుల ఇష్టారాజ్యం వల్లే పల్లవి ప్రాణాలు కోల్పోయిందని గుడ్డు సోదరుడు విక్కీ యాదవ్ ఆరోపించాడు. వినోద్ యాదవ్ నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు నా అన్న గుడ్డును జైలుకు పంపారు అంటూ బాధితుడి తమ్ముడు ఆరోపించాడు. పల్లవి మృతి తర్వాత పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అనంతరం చట్టబద్దమైన లాంఛనాల తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. పల్లవి భర్త అంత్యక్రియల కోసం పోలీసు రక్షణలో శ్మశానవాటికకు చేరుకున్నారు. అనంతరం భార్య అంత్యక్రియల చితికి నిప్పంటించారు.