Pregnant Lady Suicide: వారసుడు కావాలి అని అత్తింటి వారు వేధింపులు తాళలేక గర్భిణీ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పెనమలూరు మండలం రామలింగేశ్వర నగర్‌కు చెందిన చందు కావ్య శ్రీ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. కొన ఊపిరితో ఉన్న కావ్యశ్రీని కామినేని హాస్పిటల్‌కు భర్త, తల్లిదండ్రులు తరలించగా చికిత్స పొందుతూ కావ్యశ్రీ మృతి చెందింది. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Pawan Kalyan: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడిన పవన్ కల్యాణ్
కావ్యశ్రీ తల్లి రాజేశ్వరి ఏమన్నారంటే..
మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది అని రెండో కాన్పులో కూడా అమ్మాయి పుడుతుంది అని తన కూతుర్ని మానసికంగా అత్త,భర్త వేధిస్తున్నారని మృతురాలి తల్లి రాజేశ్వరి తెలిపారు. తన కూతురిని అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు నిరాకరించడంతో అత్త బలవంతపెట్టినట్లు ఆమె వెల్లడించారు. తన అల్లుడు పాతపాడు సచివాలయంలో టౌన్ ప్లానింగ్‌లో పని చేస్తున్నాడు అని చదువుకుని కూడా మూర్ఖంగా ఆలోచనలు చేశాడు అని రాజేశ్వరి తెలిపారు. తన కూతురుకు అబార్షన్ చేయించడానికి ఆస్పత్రుల చుట్టూ తన అల్లుడు తిప్పాడని.. పది నెలలు కూడా అవలేదు పాప పుట్టి ఇప్పుడు మళ్ళీ అబార్షన్ వద్దు అని మేము ఎంత వారించినా అతను మా మాట వినలేదని తెలిపారు. మొగల్రాజపురానికి చెందిన కానిస్టేబుల్ శ్యామ్ అనే వ్యక్తి తాను అబార్షన్ చేయించడానికి రికమండేషన్ చేస్తాను అని చెప్పాడని ఆరోపించారు. వారసుడు కావాలని తన కూతుర్ని మానసికంగా చిత్రహింసలు పెట్టారని ఆమె వెల్లడించారు. ఈసారికి చూడండి తర్వాత అబ్బాయి పుడతాడు ఏమో అని చెప్పినా వినలేదని తర్వాత మళ్ళీ అమ్మాయి అయితే ఎప్పుడైనా తీయించాలిగా అని తన అల్లుడు మూర్ఖంగా సమాధానం చెప్పాడని మండిపడ్డారు. వారసుడి ఇస్తేనే అని పెళ్లికి ముందే చెప్పి ఉంటే అతనికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్లం కాదన్నారు.