Preeti Reddy: తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కుటుంబాలు చాలానే ఉన్నాయి. రాజకీయ నాయకులు వారు ఉన్నంతకాలం రాజకీయాల్లో ప్రముఖ పాత్రలో వహించి.. ఆ తర్వాత కూడా వారి నెక్స్ట్ జనరేషన్ ను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి విజయాన్ని అందిస్తున్నారు. ఇలా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో అనేకమంది రాజకీయవేత్తలు ఇదే ఫార్ములాను కొనసాగిస్తున్నారు. ఇకపోతే.., రాజకీయం అనేది వారసత్వంగా రూపాంతరం చెందింది. ఈ కుటుంబ రాజకీయాల ప్రవాహంలో కొత్తతరం నాయకులు తమ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే పనిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి చురుకుగా ఉన్నట్లు కనపడుతోంది.
Kantara Chapter 1: హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం.. ఆస్కార్ రేసులోకి ‘కాంతారా ఛాప్టర్ 1’?
నిజానికి మల్లారెడ్డి ప్రీతి రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించారు. అంతేకాదు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏర్పాటు చేసిన విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటూ.. ఆమె అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదండోయ్.. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలన్నింటినీ పంచుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం ప్రీతి రెడ్డికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Kishkindhapuri OTT: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ వీడియోలో ప్రీతి రెడ్డి ఎటువంటి హుందాతనం చూపించకుండా.. ఎంతో ఎనర్జిటిక్ గా, అదిరిపోయే స్టెప్స్ తో మల్లారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. ఆమె ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్న సమయంలో వెనకనే ఉన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆసక్తిగా గమనించారు. నిజానికి రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఇలా బహిరంగంగా డ్యాన్స్ చేయడం చాలా అరుదు. ఈ చర్య ద్వారా ఆమె ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. కానీ ఈ వీడియో లు చూసిన నెటిజన్స్ అంత ఉన్నత స్థానంలో ఉన్న ఎలాంటి మొహమాటం లేకుండా ఆనందంగా డాన్స్ చేయడం సూపర్ అంటూ ప్రీతి రెడ్డిని మెచ్చుకుంటున్నారు.
డ్యాన్స్ చేస్తున్న BRS MLA మల్లారెడ్డి కోడలు !
😳😳😳😳😳😳😳 pic.twitter.com/0F1jcBvQP1
— Anil Reddy (@anil_reddy45) October 16, 2025