NTV Telugu Site icon

Prashanth Reddy : బీఆర్ఎస్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారినే పీఏసీ చైర్మన్‌గా నియమించాం

Prashanth Reddy

Prashanth Reddy

Prashanth Reddy : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ చైర్మన్ గా కేసీఆర్ నియమించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పీఏసీ సభ్యుల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రిష్ణారెడ్డి, గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశామని, కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారని ఆయన గుర్తు చేశారు. హరీష్ రావు నామినేషన్ ఎందుకు తిరస్కరించారని మేము అడిగామని, ఇప్పటికైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్ ను చేయాలన్నారు ప్రశాంత్‌ రెడ్డి. అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారన్నారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ చెప్పిందని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారన్నారు. ఆస్తులు కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారని, సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ను నియమించారని ప్రశాంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ సూచించిన వారిని పీఏసీ చైర్మన్ గా నియమించాలన్నారు ప్రశాంత్‌ గౌడ్‌.

Pawan Kalyan: తమిళనాడులో విజయ్ పార్టీ ఏర్పాటు ..డిప్యుటీ సి‌ఎం‌ పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్

అనంతరం ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బుల్డోజ్ పాలిటిక్స్ చేస్తోందని, అరికేపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా అక్రమంగా నియమించారని ఆమె ఆరోపించారు. పీఏసీ చైర్మన్‌గా ఎవరు ఉండాలో నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్ కు ఉందని, అరికేపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పే అధికారం కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినా చర్యలు తీసుకోలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ ఇచ్చారన్నారు సత్యవతి రాథోడ్‌. అరికేపూడి గాంధీ, పట్నం మహేందర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని, అసెంబ్లీ సాంప్రదాయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య సూత్రాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, ప్రభుత్వంలో పీఏసీ చైర్మన్ పదవి కీలకంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేసిన ఖర్చులపై పీఏసీలో చర్చ జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికేపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని మీకు అనుకూలంగా ఉన్న అరికేపూడి గాంధీకి ఎట్లా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

Wayand Polls: ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన

Show comments