NTV Telugu Site icon

Prashanth Reddy : కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు

Prashanth Reddy

Prashanth Reddy

కామారెడ్డి – జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికి అమలైంది ఉచిత బస్సు మాత్రమే, అది సక్రమంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొండంత హామిలు ఇచ్చి ..గోరంత పనులు చేయడం లేదని, కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఉన్నా.. రైతు బంధు సక్రమంగా విడుదల చేయలేదు. ఎన్నికలయ్యాక నాలుగేళ్లు పరిస్దితి ఏంటో రైతులు ఆలోచించాలని, ప్రజల్లో కాంగ్రెస్ పై అసహనం పెరుగుతుందని , అసహనంతో ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ను 100 ఫీట్ల లోతులో బొంద పెడ్తాం అంటున్నారన్నారు.

అంతేకాకుండా..’రేవంత్ రెడ్డికి దమ్ముంటే 100 ఫీట్ల లోతులో పాతి పెట్టు చూద్దాం. కేటీఆర్ సవాల్ విసిరితే .. 10 రోజులైనా సవాల్ స్వీకరించకుండా పత్తాలేడు. రేవంత్ రెడ్డి కి దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరిలో పోటీ చేయు మా కేటీఆర్ రెడీగా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మోదీకి చెంచాగిరి చేస్తున్నాడు. ఆయన బడా బాయ్.. రేవంత్ చోటా భాయ్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. రేవంత్ తో కలిసి మాట్లాడుకుని చంద్రబాబు మోదీ దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు మోదీతో పొత్తు పెట్టుకున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలైన బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇప్పటికైనా జాగ్రత్త పడాలి .. రేవంత్ రెడ్డి గందరగోళం చేసేటట్లు ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి కామారెడ్డి నియోజకవర్గం నుంచి 60వేల మెజార్టీ తీసుకొచ్చి ప్రతీకారం తీర్చుకోవాలి’ అని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.