Prabhas Prashanth Varma : ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ.. పోస్టర్ కూడా రెడీ చేశాడట ?
- ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ మూవీ ఖాయం
- పోస్టర్ వర్క్ పూర్తయిందన్న ప్రశాంత్
- అంచనాలను పెంచుతున్న కాంబో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కావడం లేదు. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.. కథ నచ్చితే వెంటనే అవకాశం ఇచ్చేస్తున్నాడు. బాహుబలి వంటి సినిమా తర్వాత సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ చేశాడు ప్రభాస్. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో కల్కి సినిమాలు తీశాడు. ప్రస్తుతం మారుతితో రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కమిట్ అయ్యాడు. ఎలాగూ సలార్ 2, కల్కి 2 లైన్లో ఉండనే ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో ఉన్న దర్శకుడు ఎవరు అంటే.. ఊహించని పేరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ప్రశాంత్.. ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఙను లాంచ్ చేసే పనిలో ఉన్నాడు.
Read Also:Astrology: నవంబర్ 18, సోమవారం దినఫలాలు
Also Read
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
- Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
అలాగే.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జై హనుమాన్తో పాటు మహాకాళీ, అధీరా లాంటి సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడైనా రావొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్ వర్మ రీసెంట్ స్టేట్ మెంట్ ఒకటి ఇపుడు ఊపందుకుంది. తాను ఒక బిగ్గెస్ట్ స్టార్ తో వర్క్ చేస్తున్నానని ఆల్రెడీ అతడితో ఓ పోస్టర్ వర్క్ ని కూడా పూర్తి చేశానంటూ చెప్పుకొచ్చాడు. దీనితో ఆ బిగ్ స్టార్ ప్రభాస్ నే కావచ్చని ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కలయిక కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ చెప్పిన ఆ బిగ్ స్టార్ ప్రభాసేనా కాదా అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం తాను కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో “జై హనుమాన్” అనే సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
Read Also:Puspa 2 Trailer: ‘పుష్ప’ గాడి అరాచకం.. రికార్డులు సృష్టిస్తున్న ట్రైలర్
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!