Prasanth Varma: హనుమాన్ సూపర్ హిట్..ఖరీదైన కారు గిఫ్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాను తెరకేక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగి పోతుంది. సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సినిమా విడుదలై మూడు వారాలు గడిచిన జోరు తగ్గలేదు.. సినిమా క్రేజ్ అంతే రేంజ్ లో ఉంది.. ఇక ఓటీటి లో కూడా మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది..
దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ మరో సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అనౌన్స్ చేశారు.. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ను మరోసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం.. అంతేకాదు కారును కూడా బుక్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతుంది.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు కామన్.. గతంలో చాలానే విని ఉంటారు.. బేబీ డైరెక్టర్‌కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్‌ప్రైజ్ ఇచ్చారు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కు కూడా గిఫ్ట్ ను ఇస్తున్నారని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!