అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడలేకపోతునందుకు శింతిస్తూ హిందీలోనే మాట్లాడతానని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా అని ఆయన అన్నారు. దేశంలో కొత్త నడవడిక ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘అంబేద్కర్ జయంతి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రత్యేకంగా నిర్వహించారు. మనం యుద్ధం చేయాలి ప్రజల్లో మార్పుకోసం, వ్యవస్థలో మార్పు కోసం, దేశంలో మార్పు కోసం.
Also Read : Jessica Jonassen: ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఫొటోలు వైరల్
దేశంలో ఆర్థిక ఇబ్బందుల పై ఎలా పోరాటం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త దిశ చూపించారు. దేశంలో ఆర్థిక అసమానతలపై ఆనాడే అంబెడ్కర్ ఫైట్ చేశారు.అంబేద్కర్ స్పూర్తితో మళ్ళీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని కాపాడేందుకు ఫైట్ చేసేందుకు కేసీఆర్ దిశ మొదలుపెట్టారు. దేశంలో ఒక్క రిలీజియస్ మైనార్టీ మాత్రమే లేదు…కమ్యూనిటీ మైనార్టీ కూడా ఉంది.రిలీజియస్ మైనార్టీ తరహాలో…కమ్యూనిటీ మైనార్టీ ఉందని ఆనాడే అంబెడ్కర్ చెప్పారు. అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దళితబందు పథకం మంచి పథకం. ఈ దేశంలో గొప్పుడు గొప్పగా..పేదోడు పేదోడిగానే ఉంటాడు. దళితబంధు ఫలితం రానున్న రోజుల్లో తెలుస్తుంది. దళితబంధు ఇవ్వాళ కేసీఆర్ స్టార్ట్ చేశారు…రానున్న రోజుల్లో మరో ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తారు చేయాలని కోరుకుంటున్నా.
Also Read : Moringa: మునగాకుతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు
దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరం…అది హైదరాబాద్ అయితేనే బాగుంటుంది. హైదరాబాద్ రెండో రాజధాని అవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.. అది నెరవేరాలని కోరుకుంటున్నా. హిందువులకు, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే ప్రతిపాదన మేరకు ఇండియా, పాకిస్తాన్ ఏర్పాటు జరిగాయి. ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకుడు లేడు… గతంలో వాజపేయి మాత్రమే జాతీయ నాయకుడు. స్థానిక నేతలకు జాతీయ స్థాయి నేతగా ఎదిగేందుకు మంచి అవకాశం ఉంది. తెలంగాణ దేశానికి డిక్సూచిగా ఉంది…దేశానికి మోడల్ అవసరం.’ అని ప్రకాశ్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు.