మునగాకు, వసకొమ్ము, వాము.. వీటిని సమంగా కలిపి దంచి, నూనెలో ఉడకబెట్టి, గాయాలకు కడితే త్వరగా మానిపోతాయి.

మునగాకును దంచి, రసం తీసి, చిటికెడు కలిపి తాగితే.. అజీర్ణ సమస్యలు వెంటనే తగ్గుముఖం పడతాయి.

లేత మునగాకు కూర వండుకొని తింటే.. పురుషులకు శక్తి అందుతుంది, సుఖ విరేచనం కలుగుతుంది.

మునగాకులను కూరగా చేసుకొని తింటే.. స్త్రీల శరీరంలో ఉండే చెడు నీరు తొలగిపోతుంది.

మునగాకు రసం తరచుగా తాగితే.. నేత్ర రోగాలతో పాటు వాత, పైత్య దోషాలు, విషాలు హరింపబడతాయి.

మునగాకు పదార్థాలు.. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించాయని పరిశోధనల్లో తేలింది.

మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు.. మెదడులో ఒత్తిడిని తగ్గించి, జ్ఞాపశక్తిని పెంచుతాయి.

మునగాకులోని ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు.. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

కణాలు దెబ్బతినకుండా రక్షించగల రోగనిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు మునగాకులో పుష్కలంగా ఉంటాయి.

మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్స్.. శరీరంలో కొవ్వును తగ్గించి, బరువుని అదుపులో ఉంచుతాయి.