NTV Telugu Site icon

Prajavani: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం.. రాష్ట్ర ప్రణాళిక సంఘం..

Prajavani

Prajavani

దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనా పరమైన అడ్డంకులు తొలగాయని ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నుండి పునః ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కారణంగా సుమారు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మొదలైన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు వివరించారు.

Coin Stuck In Throat: బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణేం..7 ఏళ్ల తర్వాత తొలగింపు..

ఇక ఈ కార్యక్రమంలో అన్ని విభాగాలకు సంబందించి మొత్తం 373 దరఖాస్తులు నమోదయ్యాయని ఆయన వివరించారు. ఇందులో రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 120 దరఖాస్తులు, విధ్యా శాఖకు సంబందించి 43, మున్సిపల్ శాఖకు సంబందించి 43, హోం శాఖకు సంబందించి 29, పౌరసరఫరాల శాఖకు సంబందించి 18, ఇతర శాఖలకు సంబందించి 120 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిసజరిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు అధికారులు.

GHMC: ఆస్తులు, భవనాల సమగ్ర సర్వే చేయాలని జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం..

Show comments