ప్రగ్య జైస్వాల్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తెలుగులో వరుణ్ తేజ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా తో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తన అందం తో, నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. కంచె సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఈ భామ వరుస సినిమాలు చేసింది.కానీ ఈ భామ కెరీర్ తను ఊహించినంత సాఫి గా సాగలేదు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా బోయపాటి శీను తెరకెక్కించిన జయ జానకి నాయక సినిమాలో ఈ భామ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా లో ప్రగ్యా గ్లామర్ రోల్ లో అదరగొట్టింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ భామ నటన కు ఫిదా అయిన దర్శకుడు బోయపాటి ఈ భామకు అఖండ సినిమాలో అవకాశం ఇచ్చాడు.
అఖండ సినిమా లో బాలయ్య సరసన అద్భుతం గా నటించింది ఈ భామ.. అఖండ సినిమా అద్భుత విజయం సాధించడంతో ప్రగ్యా వరుస సినిమాల తో బిజీ అవుతుందని చాలా మంది అనుకున్నారు.కానీ ఆ తరువాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.కాని ఆ భామ నిరాశ పడకుండా అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తుంది.అందులో భాగంగా సోషల్ మీడియా లో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. రోజు రోజుకు బ్యూటీ గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్ల కు నిద్ర లేకుండా చేస్తోంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ రెచ్చిపోతుంది.తాజాగా ప్రగ్యా చేసిన ఫోటో షూట్ బాగా వైరల్ అవుతుంది.హాట్ సిట్టింగ్ పొజీషన్ లో ఆమె నవ్వుతూ ఇచ్చిన ఫోజులకు ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.