భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ 2 కరువానాను క్లాసిక్ చెస్‌లో మొదటిసారి ఓడించాడు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో అతని విజయాలు అతన్ని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్ లో మొదటి పది స్థానాల్లోకి సంపాందిచి పెట్టింది.
Bullets in Airport: ఎయిర్పోర్టులో కలకలం.. నటుడి బ్యాగులో 40 బులెట్లు..
యువ సంచలన ప్రజ్ఞానానంద రౌండ్ 5లో ప్రపంచ నం.2 ఫాబియానో కరువానాను ఓడించడం ద్వారా చెస్ ప్రపంచాన్ని మళ్లీ ఆశ్చర్యపరిచాడు. రౌండ్ 3 లో ప్రపంచ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడకొట్టిన తర్వాత, అతను ఇప్పుడు క్లాసికల్ చెస్‌లో మొదటి ఇద్దరు ఆటగాళ్లను ఓడించాడు. కాకపోతే గురువారం స్పేర్‌బ్యాంక్ 1 SR బ్యాంక్ లో జరిగిన నార్వే చెస్ 2024 రౌండ్ 4లో ప్రగ్నానంద అమెరికాకు చెందిన హికారు నకమురాపై ఓడిపోయాడు. ఆ గేమ్ లో నకమురా ప్రజ్ఞానందకు వ్యతిరేకంగా అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు.
Komatireddy: మేడిగడ్డ ప్రపంచంలో వింత అన్నాడు.. నిజమే 3 నెలలకు కూలింది వింతే..!
మరోవైపు, ప్రాగ్ సోదరి వైశాలి దిగ్గజ క్రీడాకారిణి పియా క్రామ్లింగ్‌ను ఓడించడం ద్వారా తన ఆధిపత్య ప్రదర్శనను కొనసాగించింది. తన ఆధిక్యాన్ని మొత్తం 8.5 పాయింట్లకు పెంచుకుంది. భారత మహిళల చెస్ గ్రాండ్‌మాస్టర్ హంపీ 4వ రౌండ్‌లో అన్నా ముజిచుక్ తో జరిగిన క్లాసికల్ గేమ్‌లో ఓడిపోయింది. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ప్రముఖ మహీంద్రా కంపెనీ వ్యవస్థాపకుడు ఆనంద్ మహేంద్ర కూడా కొనసాగుతున్న నార్వే చెస్ పోటీలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ నంబర్ టూ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించిన తర్వాత భారత టీన్ చెస్ సంచలనం ఆర్ ప్రగ్నానందను ప్రశంసించారు.
Pragg.
Now, it was the world #2 in the bagg…pic.twitter.com/ubBHzAjVlu
— anand mahindra (@anandmahindra) June 2, 2024