Site icon NTV Telugu

Kalki 2898 AD Collections: బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 Ad Tickets

Kalki 2898 Ad Tickets

Kalki 2898 AD 3 Days Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా మూడో రోజు రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. రెండో రోజుతో పోల్చితే.. మూడవ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఓవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, మరోవైపు వర్షాలు పడుతున్నా.. మూడోరోజైన శనివారం ఫాన్స్ థియేటర్లకు పరుగులు తీశారు.

కల్కి 2898 ఏడీ సినిమా అమెరికాలో 9 మిలియన్లను క్రాస్ చేసి.. 10 మిలియన్ల దిశగా దూసుకుపోతోంది. నాలుగో రోజు (ఆదివారం) హాలిడే కావడంతో మొదటి వారాంతం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూల్ అవుతాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ‌నివారం 31 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్, 19.80 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. నైజాంలో శ‌నివారం రోజు 10 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుందట.

Also Read: Anushka Sharma: భారత్ గెలవగానే.. నా కూతురు ఆందోళన చెందింది: అనుష్క

కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదలైంది. తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి అడియన్స్ ఫిదా అఏవుతున్నారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రంను రూ. 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. ఇది దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

Exit mobile version