Anushka Sharma: భారత్ గెలవగానే.. నా కూతురు ఆందోళన చెందింది: అనుష్క
- సుధీర్ఘ నిరీక్షణకు తెర
- భారత్ ప్లేయర్స్ కన్నీళ్లు
- కౌగిలించుకోవడానికి ఎవరైనా ఉన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma reveals Vamika’s concern after T20 World Cup 2024 Final: గత 11 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ.. ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా ఇది భారత్‌కు నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్లు భావోద్వేనికి గురయ్యారు. చాలా మంది ప్లేయర్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో తన కూతురు వామిక ఆందోళన చెందిందని బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తెలిపారు.
భావోద్వేగంతో టీమిండియా ప్లేయర్స్ కంటతపడి పెట్టుకున్న దృశ్యాలను టీవీలో చూసిన తన కుమార్తె చలించిందని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ భావోద్వేగంతో కంటతపడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలను టీవీలో చూసిన నా కుమార్తె.. వారిని కౌగిలించుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అని ఆందోళన చెందింది. డార్లింగ్ నువ్వు బాధపడకు.. వారిని 150 కోట్ల భారతీయులు ప్రేమతో కౌగిలించుకుంటున్నారు. ఛాంపియన్స్ కంగ్రాట్స్’ అని అనుష్క రాసుకొచ్చారు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
Also Read: Amitabh Bachchan: ఆ భయంతోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదు: అమితాబ్ బచ్చన్
‘ఈ వ్యక్తిని (విరాట్ కోహ్లీ) ఎంతో ప్రేమిస్తున్నా. నువ్వు నా వాడివి అని చెప్పుకొనేందుకు కృతజ్ఞురాలిని’ అని అనుష్క శర్మ మరో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు జాతీయ జెండా ధరించి ట్రోఫీ పట్టుకున్న విరాట్ కోహ్లీ ఫొటోను షేర్ చేశారు. మ్యాచ్ అనంతరం విరాట్ తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న తన భార్య అనుష్క, కుమార్తెకు వీడియో కాల్ చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 15న అనుష్క కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..