NTV Telugu Site icon

Raja Saab Poster: సంక్రాంతి స్పెష‌ల్‌గా ‘రాజాసాబ్’ పోస్ట‌ర్ రిలీజ్‌

Prabhas

Prabhas

Raja Saab Poster: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ జోనర్ చిత్రం ప్రేక్షకులను వినోదంతో పాటు కొత్త అనుభవం అందించనుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి సందర్భంగా.. ‘రాజాసాబ్’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ చిత్ర బృందం ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ, ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని జపాన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే జపానీస్ వెర్షన్‌లో ఓ ప్రత్యేక పాట చేయాలని చిత్ర బృందం తనను సంప్రదించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో డ్యూయెట్ సాంగ్, స్పెషల్ సాంగ్, ముగ్గురు కథానాయికలతో ఓ పాట, అలాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటాయని తెలుస్తోంది. ‘రాజాసాబ్’ సినిమాపై అంచనాలు లేకుండా చూస్తే ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు మారుతి ఇది వరకే చెప్పకనే చెప్పారు.

‘రాజాసాబ్’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారర్ కామెడీ జోనర్‌లో ప్రభాస్ వంటి స్టార్ నటుడితో రూపొందుతున్న ఈ సినిమా అభిమానులకు కొత్తగా ఉండబోతోందని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాక, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. ‘రాజాసాబ్’ ప్రభాస్ కెరీర్‌లో మరో పెద్ద హిట్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Show comments