Site icon NTV Telugu

The RajaSaab: ‘ది రాజాసాబ్’ కు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే..

Therajasaab

Therajasaab

The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సంకాంత్రి కానుకగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది రాజాసాబ్’ జోరు చూపిస్తుంది. నార్త్ అమెరికాలోనే ప్రీ-సేల్స్ $500K మార్కును దాటేసింది. దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో, మాస్ జాతర సృష్టిస్తాడని మేకర్స్ చేబుతున్నారు. ఇంతకీ ఈ సినిమాకు ది రాజాసాబ్‌ అనే టైటిల్‌ కంటే ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Stock Market: స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు..

‘ది రాజాసాబ్’ గా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కావడానికి ముందు ‘రాజా’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందిందని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమా కథలో అమ్మమ్మ-మనవడు ఎమోషనల్ బాండ్, సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్ బట్టి కథకు ‘ది రాజాసాబ్’ అనే టైటిల్ అయితే బాగుంటుందని, అలా టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. మొత్తానికి ది రాజాసాబ్‌కు ఫస్ట్ అనుకున్న టైటిల్‌కు ‘రాజా’. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌లో ప్రభాస్ రెబెల్ లుక్, హారర్ ఎలిమెంట్స్, కామెడీ టైమింగ్ అదిరిపోయాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రధాన బలం తమన్ సంగీతం. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ఇది భావోద్వేగాలు, భయం, హాస్యం కలగలిసిన గ్రాండ్ ఎంటర్‌టైనర్ అని అన్నారు. జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రడీ అయిన ది రాజాసాబ్.. సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

READ ALSO: Nicolas Maduro: మదురోను పట్టుకోడానికి ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా!

Exit mobile version