Site icon NTV Telugu

The Raja Saab Day1 Collections: ప్రభాస్ స్టార్‌డమ్‌.. రాజా సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

The Rajasaab

The Rajasaab

The Raja Saab Day1 Collections: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించాడు. తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించింది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌లో తొలి రోజు సుమారు రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు అంచనా. ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కనీసం రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రీమియర్ షోల ద్వారానే రూ. 8 కోట్లకు మించి ఆదాయం రావడం గమనార్హం.

READ MORE: Trump-Greenland: గ్రీన్‌లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన

విదేశీల్లోనూ ‘ది రాజా సాబ్’ అద్భుతంగా రాణించింది. ఓవర్సీస్‌లో 25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.90 కోట్లను దాటినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల తుది లెక్కలు వెలువడితే రూ. 100 కోట్ల మార్క్ దాటుతుందా లేదా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓపెనింగ్ డే కోసం ముందస్తు బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావడం విశేషం. భారత్‌లో టికెట్ బుకింగ్స్ మరింత ముందుగానే ప్రారంభించి ఉంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ప్రభాస్ ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ స్థాయిలో కాకపోయినా అడ్వాన్స్ సేల్స్ బలంగానే నమోదయ్యాయి. క్రిటిక్స్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినా, తొలి రోజు ఈ స్థాయిలో ఓపెనింగ్ సాధించడానికి పూర్తిగా ప్రభాస్ స్టార్‌డమ్‌నే కారణమని చెప్పొచ్చు.

Exit mobile version