NTV Telugu Site icon

Prabhas Spirit: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ షురూ?

Spirit

Spirit

Prabhas Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రాల విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో తన మార్క్ నటనను అందిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏ.డి వంటి విజువల్ వండర్ సినిమాలతో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ భారీ ప్రాజెక్టుల మధ్యే మరొక ప్రత్యేక క్రేజ్ ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.

Read Also: Mass Jathara: ‘మాస్ జాతర’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందోచ్..

ఇదివరకు మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘స్పిరిట్’ సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా.. ఈ సమాచారం వారిలో హైప్ ను మరింత పెంచనుంది. ఇప్పటి వరకూ మాస్, లవర్ బాయ్ గా చిత్రాల్లో కనిపించిన ప్రభాస్.. మొదటిసారి పోలీస్ అవతారంలో హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అన్నది ఇప్పటిదాకా సస్పెన్స్‌గానే ఉండగా.. ముందుముందు మిగతా క్యాస్ట్, టెక్నికల్ టీమ్, స్టోరీ లైన్‌ పై మరిన్ని ఆసక్తికర సమాచారం రానుంది.