LEO : ప్రభాస్ సలార్ రికార్డు క్రాస్ చేసిన లియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అర్జున్, సంజయ్‌దత్, త్రిష ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా లియో మూవీ తెరకెక్కుతోంది.లియో సినిమాలో కమల్‌హాసన్, కార్తి మరియు సూర్య అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లియో ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. కొంత మంది విజయ్ ఫ్యాన్స్ మాత్రం ట్రైలర్‌తో లోకేష్ కనకరాజ్ డిసపాయింట్ చేశాడంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.యాక్షన్ సీన్స్ మొత్తం గ్రాఫిక్స్‌లో తీసినట్లుగా ఉన్నాయని, విజయ్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా చూపించలేదంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. లియో సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే బుక్ మై షోలో ప్రభాస్ సలార్ మూవీ రికార్డ్‌ను దళపతి విజయ్ లియో క్రాస్ చేసింది.ఇండియావైడ్‌గా బుక్ మై షోలో 2023 టాప్ ఫైవ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ సినిమాల లిస్ట్‌లో దళపతి విజయ్ లియో టాప్ ప్లేస్‌లో ఉండగా సలార్ సెకండ్ ప్లేస్ కు వచ్చింది.విజయ్ లియో మూవీ కి 442 k ఇంట్రెస్టెడ్ నంబర్స్ అలాగే ప్రభాస్ సలార్‌కు 367 K ఇంట్రెస్టేడ్ నంబర్స్ రావడం జరిగింది.అలాగే ఇంట్రెస్టెడ్ మూవీస్ లిస్ట్‌లో సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ మూవీస్‌ను దాటేసి బాలకృష్ణ భగవంత్ కేసరి మూడో స్థానంలో కొనసాగుతోండటం విశేషం.. భగవంత్ కేసరి సినిమాకు 118 k ఇంట్రెస్టేడ్ నంబర్స్ తర్వాత సల్మాన్ ఖాన్ టైగర్ కు 113 K ఇంట్రెస్టేడ్ నంబర్స్ షారుఖ్‌ఖాన్ డుంకీ 82k ఇంట్రెస్టేడ్ నంబర్స్ రావడం జరిగింది.. విజయ్ లియో మూవీకి పాన్ ఇండియా వైడ్‌గా ఉన్న క్రేజ్ చూసి విజయ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!