పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు.గత ఏడాది ప్రభాస్ “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించి అదరగొట్టింది .ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు .ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మే 9 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ “రాజాసాబ్”..టాలీవుడ్ దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ ,రిద్ది కుమార్,మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.కల్కి తరువాత ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ 2 షూటింగ్ మొదలు కావడంతో ఈ సినిమా షూటింగ్ ముగిసాక ప్రభాస్ “రాజాసాబ్” షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం .దీనితో “రాజాసాబ్” షూటింగ్ మరింత ఆలస్యం కానున్నదని తెలుస్తుంది.