NTV Telugu Site icon

Spirit-Prabhas: స్పిరిట్‌లో ఊహించని సర్‌ప్రైజ్‌.. బాక్సాఫీస్‌ను ఆ దేవుడే కాపాడాలి?

Spirit

Spirit

Spirit-Prabhas: దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా స్పిరిట్‌ మూవీపై క్రేజ్‌ ఓ రేంజ్‌ ఉంది. పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. వరుసగా రెండు హిట్‌ల తర్వాత ఈ చిత్రం వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఈ చిత్రం ఇప్పటికే రూ.1,100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. ఇంకా జోరు కనబరుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీర్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు. మోస్ట్ వైలెంట్ మూవీ యానిమల్‍తో సందీప్ రెడ్డి వంగా గతేడాది బ్లాక్‍బస్టర్ కొట్టారు. తీవ్రమైన విమర్శలు వచ్చినా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ప్రభాస్‍తో సందీప్ చేయబోయే సినిమా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో విపరీతంగా ఉంది. ఈ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటిస్తారని సందీప్ ఇటీవలే చెప్పారు. అయితే, స్పిరిట్ చిత్రం గురించి ఓ క్రేజీ రూమర్ బయటికి వచ్చింది.

Read Also: Raja Saab: Raja Saab: ‘రాజాసాబ్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసిందోచ్‌.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్!

డైరెక్టర్ సందీప్‌ వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు. స్పిరిట్‌ సినిమాలో ఇప్పటివరకు చూడని ప్రభాస్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌ను ఇంకే రేంజ్‌లో ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలోను ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారట. ప్రభాస్ చేయనున్న ఓ క్యారెక్టర్ నెగెటివ్‍గా ఉండనుందని తెలుస్తోంది. మరో పాత్ర పాజిటివ్‍గా ఉండనుందని సమాచారం. అయితే, సందీప్ ఇప్పటికే చెప్పిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ రెండింట్లో ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ప్రభాస్ రెండో పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్‌గా నిలిచేలా డిజైన్ చేస్తున్నాడట సందీప్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రభాస్ డ్యూయెల్ రోల్ అనే న్యూస్ మాత్రం ఆసక్తికరంగా మారింది. అసలు.. సందీప్‌ సినిమాలో ఒక్క హీరోని తట్టుకోవడమే కష్టం అంటే, అందులో డ్యూయెల్ రోల్, పైగా పాజిటివ్ నెగెటివ్ అంటున్నారంటే, బాక్సాఫీస్ దగ్గర స్పిరిట్‌ను తట్టుకోవడం కష్టమే. ఇక ఈ ఏడాది డిసెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని గతంలోనే సందీప్ రెడ్డి వంగా హింట్ ఇచ్చాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 హను రాఘవపూడి ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. కాబట్టి.. స్పిరిట్ మరింత వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందట. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని, ఫస్ట్ డే 150 కోట్లకు పైగా కొడుతున్నామని.. ప్రజెంట్ స్క్రిప్టు రెడీ పనిలో ఉన్నానని చెప్పాడు సందీప్.

Show comments