Prabhas- Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ పోస్టులో ‘‘మీకు దగ్గర ఉండి మీ వర్క్‌ను చూడడం, మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ విషెస్ చేశారు. ఇక, వీరిద్దరి కాంబినేషన్‌లో గతేడాది విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, ప్రభాస్ భైరవగా నటించారు. ప్రస్తుతం దీని సీక్వెల్ పనులు కొనసాగుతున్నాయి.
Read Also: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి
అయితే, ప్రస్తుతం ‘కల్కి2’కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే దీపిక పదుకొణెను వైజంతి మూవీస్ తొలగించిన విషయం తెలిసిందే. దీంతో కల్కి2 సీక్వెల్‌లో ఆమె పాత్రను ఎవరు పోషిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రలో బాలీవుడ్ క్వీన్ అలియా భట్ నటించనున్నట్లు న్యూస్ వస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.
