Prabhas- Amitabh: హ్యాపీ బర్త్ డే బిగ్ బీ.. మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం
- ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న అమితాబ్ బచ్చన్..
- బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపిన రెబల్ స్టార్ ప్రభాస్..
- మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా: ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas- Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ పోస్టులో ‘‘మీకు దగ్గర ఉండి మీ వర్క్‌ను చూడడం, మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ విషెస్ చేశారు. ఇక, వీరిద్దరి కాంబినేషన్‌లో గతేడాది విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, ప్రభాస్ భైరవగా నటించారు. ప్రస్తుతం దీని సీక్వెల్ పనులు కొనసాగుతున్నాయి.
Read Also: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి
Also Read
అయితే, ప్రస్తుతం ‘కల్కి2’కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే దీపిక పదుకొణెను వైజంతి మూవీస్ తొలగించిన విషయం తెలిసిందే. దీంతో కల్కి2 సీక్వెల్‌లో ఆమె పాత్రను ఎవరు పోషిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రలో బాలీవుడ్ క్వీన్ అలియా భట్ నటించనున్నట్లు న్యూస్ వస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!