Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు సినిమా మేకర్స్ అతి త్వరలో వెల్లడి చేయనున్నారు.
IFFM Awards: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం..
ఇకపోతే నేడు శనివారం సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ ఓ ఫజిల్ ను పోస్ట్ చేసింది. ఈ ఫజిల్ ను డీకోడ్ చేస్తే శనివారం సాయంత్రం 04: 05 కు అప్డేట్ అన్నట్లుగా సమాచారం. చూడాలి మరి నేడు ఈ సినిమా సంబంధించి అఫీషియల్ నటీనటుల వివరాలు., అలాగే షూటింగ్ ఎప్పుడునుండి ఇలా ఎన్నో సందేహాలను సినిమా యూనిట్ క్లారిఫై చేస్తుందో లేదో.
4 P R A B H A S 0 5
1 7 H A N U 0 8 2 4— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024