NTV Telugu Site icon

Prabhas Fans: అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో మంటలు

Theatre

Theatre

Prabhas Fans: అభిమానుల అత్యుత్సాహంతో థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రభాస్‌ జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. అభిమానుల సంఘం కోరిక మేరకు మూతపడ్డ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే అభిమానులు థియేటర్‌లో బాణసంచా కాల్చడంతో థియేటర్‌లోని సీట్లు దగ్ధమై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Read Also: Mega 154 Title Teaser : మాస్ లుక్‎లో చిరు.. కేక పుట్టిస్తున్న స్టైల్

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లో వెంకట్రామ థియేటర్ ను మూసేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అందులో బిల్లా స్పెషల్ షో వేయించారు. సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చారు. సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.

Show comments