Prabhas: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్టు చేస్తున్న ‘రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల అనంతరం సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూకట్‌పల్లి, కైతలాపూర్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ప్రభాస్ గురించి, సినిమా గురించి చాలా సేపు మాట్లాడారు. అయితే ప్రభాస్ గురించి మాట్లాడుతున్న సమయంలో మాత్రం ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అవుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ముందుగా ఆయన స్నేహితుడు, ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ (SKN) వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు, కానీ మారుతి మాత్రం కంట్రోల్ అవ్వలేదు.
READ ALSO: Maruthi: ఆఫ్రికాలో ఆ జాతి వాళ్లకు కూడా ప్రభాస్ తెలుసు
ఈ విషయాన్ని గమనించిన ప్రభాస్ వెంటనే పరిగెత్తుతూ స్టేజి మీదకు వెళ్లారు. వెళ్లి హత్తుకుని మారుతిని ఓదార్చారు. “ఇది మూడేళ్ల ప్రాసెస్” అంటూ మారుతి పేర్కొనగా, ప్రభాస్ హత్తుకుని “ఇది మూడేళ్ల కష్టం” అని అంటూ చెప్పుకొచ్చారు. తాను మొదటి సినిమా చేసినప్పుడు కూడా ఇలా ఏడవలేదు కానీ, ఈ సినిమా మాత్రం చాలా కష్టపెట్టిందంటూ మారుతి అభిప్రాయపడ్డారు. ఈవెంట్‌కి ఆనందంగా వచ్చిన వారందరినీ ఏడిపించాను అంటూ ఆయన బాధపడగా, “పర్లేదు, సినిమాలో నవ్వించావుగా” అంటూ ప్రభాస్ పేర్కొన్నారు.
అయితే రెబల్ ఫ్యాన్స్ కానీ, సినిమా ఫ్యాన్స్ కానీ సినిమా ఏమాత్రం ఇబ్బంది పెట్టింది అనిపించినా తన వద్దకు రావాలని, తన ఇంటి అడ్రస్ కూడా లైవ్ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
READ ALSO: Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధికి పవన్ కళ్యాణ్
