Site icon NTV Telugu

Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. బర్త్‌డేకి ‘రాజాసాబ్’ ఎంట్రీ ఫిక్స్.?

Raja Saab

Raja Saab

Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ మధ్యకాలంలో పవర్ ఫుల్ పాత్రల్లో మాత్రమే కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకు తగ్గట్టుగా డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది రాజాసాబ్’.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీమ్, ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచబోతుంది. సినిమా విడుదలకు 100 రోజుల ముందే ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్, త్వరలో మరో మేజర్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తున్నారు.

Bollywood: ఒకే ఫ్రేమ్‌లో యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్‌ బీస్ట్.. షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్.. కొత్త సినిమా రాబోతోందా..?

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు. సాంగ్ లాంచ్ అని స్పష్టంగా చెప్పకపోయినా, అక్టోబర్ 23న (ప్రభాస్ పుట్టినరోజు) రెబెల్ సాబ్ ఎంట్రీ ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. అంటే డార్లింగ్ బర్త్‌డే సందర్భంగా సినిమా నుంచి తొలి పాట లేదా ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ చేస్తుండటం, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం, అలాగే గ్లామర్ క్వీన్స్ అయిన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిథీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఇప్పుడు ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ‘ది రాజాసాబ్’ టీమ్ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది.

South Heroines: బాలీవుడ్‌లో సౌత్ బ్యూటీస్ డిమాండ్.. వరుస ప్రాజెక్ట్స్ తో హీరోయిన్ బిజీబిజీ.?

Exit mobile version