Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. బర్త్‌డేకి ‘రాజాసాబ్’ ఎంట్రీ ఫిక్స్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ మధ్యకాలంలో పవర్ ఫుల్ పాత్రల్లో మాత్రమే కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకు తగ్గట్టుగా డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది రాజాసాబ్’.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీమ్, ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచబోతుంది. సినిమా విడుదలకు 100 రోజుల ముందే ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్, త్వరలో మరో మేజర్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తున్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు. సాంగ్ లాంచ్ అని స్పష్టంగా చెప్పకపోయినా, అక్టోబర్ 23న (ప్రభాస్ పుట్టినరోజు) రెబెల్ సాబ్ ఎంట్రీ ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. అంటే డార్లింగ్ బర్త్‌డే సందర్భంగా సినిమా నుంచి తొలి పాట లేదా ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ చేస్తుండటం, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం, అలాగే గ్లామర్ క్వీన్స్ అయిన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిథీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఇప్పుడు ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ‘ది రాజాసాబ్’ టీమ్ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది.
South Heroines: బాలీవుడ్‌లో సౌత్ బ్యూటీస్ డిమాండ్.. వరుస ప్రాజెక్ట్స్ తో హీరోయిన్ బిజీబిజీ.?
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!