NTV Telugu Site icon

Pothula Suneetha: వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

Pothula Suneetha

Pothula Suneetha

వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె.. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను జగన్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సునీత తెలిపింది.

Read Also: Apple CFO: ఆపిల్ సీఎఫ్ఓగా భారత్ సంతతికి చెందిన కెవాన్ పరేఖ్

మరోవైపు.. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. రాజ్యసభకు రాజీనామా చేయనున్నారు మోపిదేవి వెంకట రమణ. ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం.. రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ ప్రకటించే అవకాశం ఉందట.. అంతేకాదు.. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న మోపిదేవి వెంకటరమణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి వస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Also: Cabinet Decisions: 12 కొత్త స్మార్ట్ సిటీలు,10 లక్షల మందికి ఉద్యోగాలు.. కేబినెట్ నిర్ణయం..

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, పార్టీకి దూరంగా ఉన్నారు. కొందరు పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తు్న్నారు. మరోవైపు.. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇలా ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు.