Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం!
- నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
- సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
- కార్యక్రమంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. అలానే మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
పొట్టి శ్రీరాములు స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడకలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటయ్యే తొలి భారీ విగ్రహం ఇదే. విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుమును ఉపయోగించారు.
Also Read
- Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
- Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
- New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
Also Read: AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!
విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయానికి చేరుకోనున్నారు. అక్కడ యుద్ధ ప్రభావం, గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఆర్టీజీఎస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సాయంత్రం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రంజాన్ నెల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విందును ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొననున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!