ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడుపై పొట్లదుర్తి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సొంత గ్రామం కోసం సీఎం రమేష్ ఎంపీగా ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీగా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేశావా? అంటూ నిలదీశారు.. సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. కాంట్రాక్టు పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్నారు. సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంటి వద్దకు వచ్చి సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు డబ్బులు కోసం లబోదిబో అంటున్నారన్నారు.. పొట్లదుర్తి గ్రామంలో ప్రజల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని.. సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తీరని మోసం ద్రోహం చేస్తున్నావన్నారు..
READ MORE: Sharmishta Panoli: శర్మిష్ట పనోలికి బిగ్ షాక్.. బెయిల్ తిరస్కరించిన హైకోర్టు
లిక్కర్ స్కాం చేసావ్, ప్రజల నుంచి భూములు లాక్కున్నావ్ చేయని చెడ్డ పనులు లేవని మండిపడ్డారు.. రోజుకో పార్టీ మారుతూ పబ్బం గడుపుకుంటున్నావని విమర్శించారు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకి వెళ్తావు… బీజేపీలోకి వెళ్ళావు మరి ఎందుకు ఉక్కు పరిశ్రమ తీసుకుని రాలేక పోతున్నావన్నారు..
నీకు, నీ సోదరుడికి ఉన్న నీచపు బుద్ధి ప్రపంచంలో ఎవరికి ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: Medical Assistance: హీరో ప్రభాస్, సోనూసూద్‌లు సాయం చేయాలంటూ పాదయాత్ర
