India Post: తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం.. 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్!

  • తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం
  • 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్
  • 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్సెల్, 48 స్పీడ్ పోస్ట్‌లను ప్రారంభించారు
India Post

India Post

భారతీయ తపాలా శాఖ (India Post) మూడు కొత్త ప్రీమియం సేవలను ప్రారంభించింది. ఇవి వేగవంతమైన, టైమ్-బౌండ్ డెలివరీలను అందించడానికి రూపొందించారు. మార్చి 17, 2026 నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర, కాలపరిమితి గల సరుకుల కోసం 24 గంటల డెలివరీకి హామీ ఇచ్చే మూడు ప్రీమియం సేవలను తపాలా శాఖ మంగళవారం ప్రారంభించింది.

Also Read:Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?

కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్సెల్, 48 స్పీడ్ పోస్ట్‌లను ప్రారంభించారు. ఇవి ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీ పడేలా, అత్యవసర డాక్యుమెంట్లు, పార్శిల్స్‌కు గ్యారెంటీ డెలివరీ ఇస్తాయి.ప్రారంభంలో ఈ సేవలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఆరు నగరాల్లో అందుబాటులో ఉండనున్నాయి. నిర్దేశిత కాలపరిమితిలోగా డెలివరీని నిర్ధారించడానికి ఈ శాఖ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, డెడికేటెడ్ ప్రాసెసింగ్ విండోలతో వేగవంతం చేయనుంది.

మూడు కొత్త ప్రీమియం సేవలు:

24 Speed Post

డాక్యుమెంట్లకు (Documents) నెక్స్ట్ డే డెలివరీ (D+1 – బుకింగ్ తర్వాత ఒక రోజులోనే).
గ్యారెంటీ టైమ్-బౌండ్ సర్వీస్, డిలే అయితే మనీ-బ్యాక్ ఆప్షన్ ఉంటుంది.

24 Speed Post Parcel

పార్శిల్స్ (Parcels) కోసం కూడా నెక్స్ట్ డే డెలివరీ గ్యారెంటీ.
ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌తో ప్రాసెస్ చేసి, ఎంపిక చేసిన సిటీల మధ్య వేగంగా చేరవేస్తారు.

48 Speed Post

డాక్యుమెంట్లు లేదా పార్శిల్స్‌కు రెండు రోజుల్లో (D+2) గ్యారెంటీ డెలివరీ.
విస్తృత నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది, మరిన్ని రూట్లకు వర్తిస్తుంది.

Also Read:Moinabad Drug Case : రంగంలోకి సిట్.. నిందితుడు నమిత్ శర్మ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

కస్టమర్-ఫ్రెండ్లీ ఫీచర్లు.. OTP-ఆధారిత సెక్యూర్ డెలివరీ, ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్, SMS అలర్ట్స్, బిజినెస్ కస్టమర్లకు Buy Now Pay Later (BNPL), బల్క్ బుకింగ్స్‌కు ఫ్రీ పికప్, API ఇంటిగ్రేషన్, సెంట్రలైజ్డ్ బిల్లింగ్. డిలే అయితే మనీ-బ్యాక్ గ్యారెంటీ. ఇది ప్రైవేట్ కొరియర్లతో సమానంగా పోటీ పడేలా చేస్తుంది. ఈ సేవలు తపాలా శాఖను మరింత ఆధునికీకరించి, ఈ-కామర్స్, అత్యవసర డాక్యుమెంట్లు, బిజినెస్ షిప్‌మెంట్లకు బెస్ట్ ఆప్షన్‌గా మారుస్తాయి. ధరలు ప్రీమియం కాబట్టి సాధారణ స్పీడ్ పోస్ట్ కంటే ఎక్కువ ఉండవచ్చు, కానీ గ్యారెంటీ & స్పీడ్ వల్ల విలువైనవి.