ప్రభుత్వం అందించే స్కీమ్ లలో పోస్టాఫీసు స్కిమ్స్ కూడా ఉన్నాయి.. ఈ స్కీమ్ లకు మంచి డిమాండ్ దేశంలోని అభివృద్ధి చెందని ఎక్కువ ప్రాంతాలలో నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి ఎన్నెన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఇండియా పోస్ట్ మంచి రాబడిని అందించే అనేక ప్రమాద రహిత పొదుపు పథకాలను అమలు చేసింది. ఎటువంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం రావడంతో ప్రజలు ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. దీంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతుంది..
ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్కీమ్ గ్రామ సురక్ష యోజన పథకం.. తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను అందిస్తోంది… అసలు ఈ పథకం గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. గ్రామ సురక్ష యోజన పథకంలో చేరాలంటే.. ఆ పాలసీదారు యొక్క వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట ప్రవేశ వయస్సు 55 సంవత్సరాలకు మించకూడదు. కనిష్ట హామీ మొత్తం రూ. 10,000 నుంచి గరిష్ట హామీ మొత్తం రూ. 10 లక్షలు వరకు ఉంటుంది.. పాలసీ దారుడు మెచ్యూర్ సమయానికన్నా ముందే పాలసీదారుడు చనిపోతే అది బోనస్‌కు అర్హత లేదు. ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.60 వరకు బోనస్ ను కల్పిస్తారు.
అలాగే ప్రీమియంలు చెల్లించాల్సిన వయస్సు 55, 58 లేదా 60 సంవత్సరాలు వరకు చెల్లింపులు చెయ్యాలి.. అప్పుడే మంచి బెనిఫిట్స్ ము సొంతం చేసుకోవచ్చు.. ప్రతి నెలా పాలసీలో రూ.1,515 పెట్టుబడి పెట్టడం ద్వారా అంటే రోజుకు సుమారు రూ.50, పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత పాలసీదారు రూ.34.60 లక్షల రాబడిని పొందవచ్చు..మెచ్యూరిటీ ప్రయోజనం 55 ఏళ్ల కాలానికి రూ. 31,60,000, 58 ఏళ్ల కాలానికి రూ. 33,40,000 మరియు 60 ఏళ్ల కాలానికి రూ. 34.60 లక్షలు పొందవచ్చు.. అంతే కాదు పన్ను మినహాయింపు కూడా ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. లోన్ పొందే అవకాశాలు కూడా ఉండటంతో ఈ పథకానికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇన్వెస్ట్ చెయ్యండి..