Post Office Scheme: ఏడాదికి కేవలం రూ.755లకే ప్రీమియం.. రూ.15 లక్షల ప్రయోజనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Post Office Scheme: కరోనా మహమ్మారి తర్వాత భారతీయులలో జీవిత బీమా (Life Insurance), ఆరోగ్య బీమా (Health Insurance) పట్ల అవగాహన గణనీయంగా పెరిగింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైనా, ప్రమాదం జరిగినా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, అధిక ప్రీమియంల కారణంగా చాలా మంది బీమా తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా అత్యంత తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది.
50MP కెమెరా, జెమినీ లైవ్ ఫీచర్స్, IP54 రేటింగ్‌తో Samsung Galaxy M17 5G లాంచ్..!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా ఈ ప్రమాద బీమా పథకాలను ప్రారంభించాయి. 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పాలసీలను దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల ద్వారా పొందవచ్చు. రూ.555, రూ.755 ప్రీమియం ప్లాన్లు తక్కువ ఖర్చుతో అధిక బీమా కవరేజీని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా హెల్త్ ప్లస్ (ఆప్షన్ 1) కింద సంవత్సరానికి రూ.355 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా పొందవచ్చు. ఈ స్కింలో భాగంగా.. పాలసీకి తీసుకున్న వ్యక్తికి ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగి ఎముక విరిగితే రూ.25,000 లభిస్తుంది. అలాగే హెల్త్ ప్లస్ (ఆప్షన్ 2) ద్వారా రూ.555 ప్రీమియంతో రూ.10 లక్షల బీమా, పిల్లల చదువుకు రూ.50,000, దహన ఖర్చులకు రూ.5,000 అందుతాయి. ఇంకా హెల్త్ ప్లస్ (ఆప్షన్ 3) కింద రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షల బీమా, పిల్లల వివాహానికి రూ.1 లక్ష, ఎముక విరిగితే రూ.25,000 లభిస్తాయి. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత అంగవైకల్యం కలిగితే బీమా మొత్తాన్ని 100% కుటుంబానికి చెల్లిస్తారు.
Vemulawada Temple: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాసిరకం లడ్డూలు..
రూ.755 ప్లాన్ కింద పాలసీదారు మరణిస్తే నామినీకి రూ.15 లక్షలు పిల్లల చదువుకు, వివాహానికి రూ.1 లక్ష చొప్పున లభిస్తాయి. వైద్య ఖర్చులకు రూ.1 లక్ష వరకు, రోజుకు రూ.1,000 (ఐసీయూలో రూ.2,000) చెల్లింపు ఉంటుంది. అలాగే రూ.399 ప్లాన్ ద్వారా రూ.10 లక్షల బీమా, బ్రెయిన్ స్ట్రోక్ లేదా అంగవైకల్యం ఏర్పడినా పూర్తి మొత్తం లభిస్తుంది. ఆసుపత్రి చికిత్సకు రూ.60,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు. రూ.299 ప్లాన్ కూడా రూ.10 లక్షల ప్రమాద బీమాను అందిస్తుంది. అయితే దీనికి అదనపు ప్రయోజనాలు లభించవు. ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లాన్ కింద పాలసీదారులు రిమోట్ కన్సల్టేషన్‌లు, వార్షిక ఆరోగ్య తనిఖీ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బీమా పాలసీలను పొందాలంటే తప్పనిసరిగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి. తక్కువ ప్రీమియంతో భద్రత కోరుకునే వారికి పోస్టల్ శాఖ అందిస్తున్న ఈ పథకాలు ఒక మంచి ఆర్థిక రక్షణగా నిలువనున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..