NTV Telugu Site icon

Union Budget: తాయిలాలతో హ్యాట్రిక్ కొట్టనున్నారా?

Niramala Modi

Niramala Modi

గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ చదవనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది?, ఎలాంటి వరాలు ప్రకటించబోతున్నారోనన్న చర్చ నడుస్తోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ సర్కార్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజాకర్షక పథకాలను ప్రకటించే ఛాన్సుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు చాలా ఆశలే పెట్టుకున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా నిత్యవసర ధరల పెరుగుదలతో నానా ఇబ్బందులు పడుతున్నరు. దీంతో ఈ బడ్జెట్‌లో ఊరట కలిగించే ప్రకటనలు ఉంటాయని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ సమయంలో పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఉన్నాయి. వీటిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రకటిస్తే వారు లబ్ధి పొందే ఛాన్సు ఉంది.

అలాగే మధ్య తరగతి ప్రజలు కూడా ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ధరలతో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పన్ను శ్లాబ్‌పై మార్పులు ఉంటాయని నమ్మకం పెట్టుకున్నారు. రూ.3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచొచ్చని భావిస్తున్నారు. అదే గనుక జరిగితే మధ్య తరగతి కుటుంబాలు లాభం పొందే అవకాశం ఉంది.

ఇక పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పప్పుల దగ్గర నుంచీ కూరగాయలు.. ఇలా ఒక్కొక్కటి ధరలన్నీ ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో ధరల తగ్గుదలకు ఏమైనా ప్రకటనలు ఉంటాయని ఎదురుస్తున్నారు. ఇలా ఆయా కేటగిరీ ప్రజలు కేంద్ర బడ్జెట్‌పై చాలా ఆశలనే పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల పండుగ జరగనుంది. మోడీ సర్కార్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కచ్చితంగా ప్రజాకర్షక పథకాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ బడ్జెట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.