NTV Telugu Site icon

Posani Krishna Murali: వాలంటీర్ల అంశంపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

Posani

Posani

Posani Krishna Murali: ఏపీలో పింఛన్ దారుల్లో వాలంటీర్లకు మంచిపేరు తెచ్చి పెట్టిందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. చంద్రబాబు హయాంలో రెండు మూడు రోజుల సమయం పట్టేదని.. పింఛన్ కోసం వెళ్లి ఎంతో మంది చనిపోయారని ఆయన విమర్శించారు. వాలంటీర్లు పింఛన్ దారులకు దేవుళ్లుగా కనిపించారన్నారు. ఎవరైనా ఒక పార్టీ పెట్టి, మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టి ముఖ్యమంత్రి అవుతారు.. చంద్రబాబు అలా చేయరు.. టీడీపీలోకి వచ్చి ఎన్టీఆర్ గెలిపించిన వందల మందిని కొనుగోలు చేశారని విమర్శలు గుప్పించారు. టీడీపీని కబ్జా చేశారు.. ఎన్టీఆర్ కోర్టుకు వెళ్తే పార్టీ చంద్రబాబుదే అని తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కోసం ఎన్టీఆర్‌ను, రాజకీయ భవిష్యత్ కోసం వంగవీటి రంగాను చంపారని.. జగన్‌ను రాజకీయంగా సమాధి చేయడం కోసం 23 మంది ఎమ్మెల్యేలను వందల కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Delhi Liquor case: కవితకు మరో చుక్కెదురు..! విచారణ కోసం సీబీఐ పిటిషన్

కాపులను రౌడీలు, గుండాలు అని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు కాపులను లొంగదీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇంట్లో ఖాళీగా కూర్చోరని… కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతారని పోసాని ఆరోపణలు చేశారు. ఇంట్లో ఖాళీగా కూర్చోని చంద్రబాబు పింఛన్ దారులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. 60, 70 లక్షల ఫించన్ దారులు జగన్‌కు ఓటేస్తారేమోనని అని కుట్రలు చేశారన్నారు. ఆంధ్ర దేశానికి క్యాన్సర్ గడ్డ నిమ్మగడ్డ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎవరైనా సచివాలయంకు వచ్చి పెన్షన్ తీసుకుకోవాల్సిందే అని ఎన్నికల కమిషన్‌తో ఆదేశాలు జారీ చేయించారన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సకల సౌకర్యాలు అనుభవించారని.. జైల్లో ఏసీ, ఇంటి భోజనం అన్ని తెప్పించుకున్నారన్నారు. కుంటి, గుడ్డి, లెప్రసి ఉన్నవాళ్లు అనే జాలి, దయ చంద్రబాబుకు ఉండదన్నారు. నారా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అందరూ ఒకే మనస్తత్వం కలవారని.. ఒకేలా ఆలోచిస్తారన్నారు.