NTV Telugu Site icon

Posani Krishna Murali: నన్ను హత్య చేసేందుకు లోకేష్‌ కుట్ర.. నేనే చచ్చిపోతే ఆయనదే బాధ్యత..!

Posani Krishna Murali

Posani Krishna Murali

Posani Krishna Murali: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి.. నన్ను హత్య చేయటానికి లోకేష్ కుట్ర పన్నుతున్నాడన్న ఆయన.. కోర్టుకు హాజరయ్యేటప్పుడు నన్ను చంపాలని చూస్తున్నారు.. నేను చచ్చిపోతే నారా లోకేష్ దే బాధ్యత అంటూ ఆరోపించారు. లోకేష్ కంటే క్రెడిబులిటీ ఉన్న వాడిని.. సీఎం వైఎస్‌ జగన్ వ్యక్తిత్వం నచ్చే జగన్ ను అభిమానిస్తున్నాను అని తెలిపారు.. నేను కేసు పెడతాను.. నిజం కావాలా? సాక్ష్యం కావాలా? అని ప్రశ్నించారు. బూతుల వల్ల సమాజం పాడవదా? అని ప్రశ్నించారు. బూతు పనుల వల్ల సమాజం పాడవుతుందన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని భూముల కుట్రలు పన్నారన్న ఆయన.. నన్ను కూడా ఇక్కడ భూములు కొనమని అప్పుడు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అమరావతి ప్రాంతంలో భూములు ఇవ్వటం వెనుక త్యాగాలు లేవు.. భూముల రేట్లు పెంచుకోవాలనే తాపత్రయం అంటూ విమర్శలు గుప్పించారు పోసాని.

ఇక, మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడిన బూతుల వీడియోను ప్రదర్శించారు పోసాని కృష్ణమురళి.. నారా లోకేష్ నాపై పరువు నష్టం కేసు వేశారు.. లోకేష్ 18 ఎకరాలు కొన్నారని నేను అన్నానట.. తాను ఒక ఎకరం కూడా కొనలేదట.. నాలుగు కోట్ల నష్టపరిహారం, రెండు ఏళ్లు జైలు శిక్ష కూడా నాకు పడే అవకాశం ఉందట అని చెప్పుకొచ్చిన ఆయన.. లోకేష్ మృదు స్వభావి.. కారులో బైనాక్యులర్స్ పెట్టుకుని చీమలకు కూడా హాని కలగకుండా వెళతారట అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ అమ్మనా బూతులు తిడితే పరువు నష్టం దావా వేయకూడదా? అని ప్రశ్నించారు. కంతేరులో భూమి కొన్నాడని అనటం పరువు నష్టం అయ్యిందట.. లోకేష్ పీఏ చైతన్య నాకు ఫోన్ చేశాడు.. నాకు అనారోగ్యంగా ఉందని తెలిసి పరామర్శించటానికి వస్తాను అన్నాడు.. తర్వాత పది రోజులకు ఫోన్ చేసి టీడీపీలో చేరాలని మళ్లీ ఫోన్ చేశాడని గుర్తు చేసుకున్నారు.

ఫారిన్ అమ్మాయిలతో మందు తాగి తందనాలు ఆడిన లోకేష్ నా పై పరువు నష్టం కేసు పెడతాడా? అంటూ మండిపడ్డారు పోసాని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే లోకేష్ పోస్టింగ్‌లు ఇస్తాడట.. లోకేష్ వాళ్ల అమ్మ భువనేశ్వరి, భార్య ఆస్తులు లోకేష్‌వి కావా? అని ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది వాస్తవం కాదా? లోకేష్ కు తెలియకుండా బ్రాహ్మణి హెరిటేజ్ లో డైరెక్టర్ అయ్యిందా? అంటూ నిలదీశారు. ఇక, చంద్రబాబు ఏ వ్యవస్థను ఆయినా నాకేస్తాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో అమరావతి రైతులకు పోసాని ఛాలెంజ్ విసిరారు.. మాది చాలా పేద కుటుంబం.. డబ్బులు లేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కష్టపడి పైకి వచ్చి సంపాదించాను.. నా సంపాదన అంతా పేద వాళ్లకు ఇచ్చేస్తాను.. ప్రతిఫలంగా అమరావతి రైతులు కోర్టు కేసులు వెనక్కి తీసుకుంటారా? అంటూ బహిరంగ సవాల్‌ విసిరారు పోసాని కృష్ణమురళి.

Posani Krishna Murali Press Meet LIVE | Ntv