ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటర్ల వ్యవస్థపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏడ్చారు అని పోసాని కృష్ణ మురళి అన్నారు. మగ వాలంటర్లు నారా లోకేష్ లా తాగుబోతులు.. తిరుగు బోతులు కాదు అని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు ఉండాలి.. వాలంటర్ల వ్యవస్థపై చంద్రబాబుకు కన్ను కుట్టింది అని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థపై ఎన్నికల కమిషన్ (ఈసీ) కి ఫిర్యాదు చేసింది నిమ్మగడ్డో ? క్యాన్సర్ గడ్డో? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక టైపు అనుకుంటే.. దగ్గుబాటి పురంధేశ్వరి వంద టైపులు అని తెలిపారు. పురంధేశ్వరికి ఆర్ఎస్ఎస్ అంటే ఎంటో కూడా తెలియదు అని చెప్పారు. సావర్కర్ అంటే.. గవాస్కర్ అనుకుంటుంది పురంధేశ్వరి అని పోసాని కృష్ణ మురళి విమర్శించారు.
Read Also: West Bengal: అందరు చూస్తుండగానే.. ఓ యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ అభ్యర్థి..
సీఎం జగన్ మీద సీజేఐకి లేఖ రాస్తారు పురందేశ్వరీ.. మరి మోసాలు చేసిన సుజనా చౌదరి, సీఎం రమేష్ పై ఎందుకు రాయలేదు లేఖ? అని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. సుజన చౌదరి మోసాలపై పంప్లేట్ లు పంచుతాను అని తెలిపారు. జయప్రదను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి ఆమె జీవితాన్ని చంద్రబాబు సర్వ నాశనం చేశారు అన్నారు. చంద్రబాబు 2014లో ఆరు వందల హామీలు ఇచ్చారు.. అందులో ఏ హామీలు నిలబెట్టుకోడు ఆయన అని పోసాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము సంతోషంగా ఉంటాం.. చంద్రబాబు, నారా లోకేష్ తీర్థ యాత్రలకు వెళ్ళండి అని పోసాని కృష్ణ మురళి కోరారు.