Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ.. నేడు బిజీ షెడ్యూల్!

Cm Chandrababu

Cm Chandrababu

కేంద్ర నౌకాయాన జల రవాణాశాఖా మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోనీ కేంద్ర బృందం ఇవాళ ఏపీకి రానుంది. సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం కానుంది. ఏపీలో నౌకల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటుపై సీఎంతో కేంద్ర అధికారులు మాట్లాడనున్నారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. రాష్ట్రంలో నౌకల మరమ్మత్తుల కేంద్రం నిర్మాణానికి రూ.3 వేల కోట్లు అవుతుందని అంచనా. ఏటా 300 నౌకలు రీసైక్లింగ్ కోసం రానున్నాయి. ఏపీలో ప్రపంచస్థాయి షిప్ మరమ్మత్తుల కేంద్రం నిర్మాణం చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే షిప్ బ్రేకింగ్ యూనిట్‌పై ఫిజుబులిటి రిపోర్టును విశాఖ పోర్ట్ ఇచ్చింది.

Also Read: Train Accident: సెల్‌ఫోన్‌.. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది!

మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షించనున్నారు. సాయంత్రం 6.30కు సచివాలయం నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు చీఫ్ జస్టిస్‌తో భేటీ కానున్నారు. ఇక 7.40కి తిరిగి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. నేడు వరుస సమావేశాలతో సీఎం బిజీగా ఉండనున్నారు.

Exit mobile version