Site icon NTV Telugu

Poonam Kaur: ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ ట్వీట్

Poonam-Kaur

Poonam kaur Tweet about Political Leder Goes Viral: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు ఇష్టమైన విషయాలను షేర్ చేసుకుంటూ ఉండే పూనమ్ కౌర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. నాయకులు స్త్రీని ఎలా గౌరవిస్తారో అదే విధంగా వారి అనుచరులు కూడా గౌరవిస్తారు. నాయకుడిగా ఉండటం అనేది బాధ్యతాయుతమైన విషయం కానీ చాలామంది దానిని స్వీయ కీర్తి కోసం ఉపయోగిస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడు అని ఆమె రాసుకొచ్చింది. అయితే ఇక్కడ ఆమె ఎవరినీ ప్రస్తావించకపోయినా చాలా మంది పవన్ కళ్యాణ్ ను ఈ వ్యవహారంలోకి తీసుకు వస్తున్నారు.

Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతుపై ఏయే సెక్షన్ల కింద కేసు పెట్టారో తెలుసా?

ఈ పోస్టు కింద పవన్ కళ్యాణ్ పేరుతో కామెంట్లు చేస్తున్నారు. ఇక నిన్న ఆమె త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్లు చేసింది. ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సాయి ధరమ్ తేజ్ స్పందించినట్టుగానే జల్సా సినిమాలో పవన్ రేప్ కామెంట్ల మీద కూడా స్పందించాలని ఒక నెటిజన్ కామెంట్ చేయగా అది త్రివిక్రమ్ డైలాగ్స్ అని అంతకన్నా మంచి డైలాగ్స్ అక్కడి నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేమని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాక ఒకరు త్రివిక్రమ్ ను వెనకేసుకు రాగా తనకు అతను ఏం చేశాడో, ఇతరులతో ఏమి చేయించాడో అతన్నే అడగాలని కూడా కామెంట్ చేసింది. ఇక ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

Exit mobile version